మారుమూల గ్రామానికి ట్రాక్టర్ పై వెళ్లిన ఎమ్మెల్యే

KMM: పాల్వంచ మండలం కిన్నెరసాని అటవీ ప్రాంతంలోని గడ్రబంధం గ్రామాన్ని ఆదివారం ఎమ్మెల్యే సాంబశివరావు సందర్శించారు. ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో ట్రాక్టర్ పై కొంత దూరం వెళ్లి ఆ తర్వాత కాలినడకన గ్రామాన్ని చేరుకొని ఆ గ్రామంలో ఇటీవల మరణించిన సీపీఐ నాయకులు మాజీ సర్పంచ్ తాటి రాధమ్మ భర్త తాటి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు.