VIDEO: డ్రోన్ తనిఖీలలో పట్టుబడ్డ మందుబాబులు
AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శివారు ప్రాంతంలో డ్రోన్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులు పట్టుపడ్డారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించటం, గంజాయి వాడకం వంటి అసాంఘిక కార్యకలాపాలు చట్టరీత్యా నేరమన్నారు. అటువంటి వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.