మల్లాపూర్ డివిజన్ అభివృద్ధి పనులకు సమీక్ష
MDCL: మల్లాపూర్ వార్డు కార్యాలయంలో దుర్గానగర్, బాబానగర్ కాలనీ, ఈద్గాహ్, గ్రేవ్ యార్డ్ కమిటీ సభ్యులు కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో ప్రహరీ గోడ, వెయిటింగ్ హాల్, బాత్‌రూములు, ప్రార్థన స్థలాల సీసీ ఫ్లోర్ ఎక్స్‌టెన్షన్, వాజు కానా తదితర అభివృద్ధి పనులలో తగిన చొరవ చూపాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.