ఈ అలవాట్లతో జాగ్రత్త!
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా ఎక్కువ సేపు ఆఫీస్‌లో కూర్చుంటే ముప్పు తప్పదని వైద్యులు అంటున్నారు. గంటల తరబడి కూర్చుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. అలాగే.. అల్పాహారం దాటవేయడం, సరిగా నిద్రపోకపోవడం, కాఫీ ఎక్కువగా తాగడం, ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం, ఫాస్ట్‌గా తినడం, చిరుతిళ్లు ఎక్కువగా తినడం మంచిది కాదంటున్నారు.