'హక్కులపై అవగాహన అవసరం'
PPM: బాలలకు న్యాయ పరమైన హక్కులపై సంపూర్ణ అవగాహన ఉండాలని రెండవ అదనపు జిల్లా జడ్జి, మండల సేవా కమిటీ అధ్యక్షుడు ఎస్. దామోదరరావు అన్నారు. శుక్రవారం జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం రూరల్ మండలం నర్సిపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు.