కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

MDK: రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామ శివారులోని బ్రిడ్జ్ పుష్పల వాగు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఘటనా స్థలాన్ని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిశీలించారు. వారు ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించారు. నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.