విచారణకు సహకరిస్తా: మాజీ మంత్రి

AP: లిక్కర్ కేసులో మాజీ మంత్రి నారాయణస్వామిని సిట్ అధికారులు 6 గంటల పాటు ప్రశ్నించారు. సిట్ విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'సిట్ అధికారులు నాలుగు ప్రశ్నలు అడిగారు. ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని చెప్పాను. మరోసారి విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు' అని తెలిపారు. కాగా, వైసీపీ హయాంలో నారాయణస్వామి ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పనిచేశారు.