కార్యకర్తకు ప్రమాద బీమా అందజేసిన ఎమ్మెల్యే

ATP: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త నరసింహులు కుటుంబానికి MLA దగ్గుపాటి ప్రసాద్ రూ.5 లక్షల సాయం అందించారు. ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడని తెలిపారు. మృతుడికి టీడీపీ సభ్యత్వం ఉండటంతో ప్రమాద బీమా కింద రూ. 5లక్షలు మంజూరైందని తెలిపారు. ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేసి అండగా నిలిచామన్నారు.