VIDEO: బాజీరావు మహారాజ్ శోభాయాత్ర
ADB: బేల మండలం మణియార్పూర్ గ్రామంలో శ్రీ బాజీరావు మహారాజ్ శోభాయాత్ర బుధవారం వేకుజామున అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేళ తాళాలతో గ్రామంలోని పలు వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. బాజీరావు మహారాజ్ ప్రవచించిన ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.