51.2 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

BDK: భద్రాచలం వద్ద గోదావరి ప్రమాద దిశగా ప్రవహిస్తోంది. ఇప్పటికే మొదటి, రెండోవ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు గోదావరి నీటిమట్టం 50 అడగులుగా ఉండగా, 10 గంటలకు 51.2 అడుగులకు చేరింది. నీటి ప్రవాహం 52 లేదా 53 అడుగుల వరకు పెరిగి అనంతరం నిలకడగా ఉండి, నెమ్మదిగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.