హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ల కోసం కొత్త పోర్టల్ ప్రారంభం
KMM: తెలంగాణ హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్‌లో ఉన్న 5వేల రిజిస్ట్రేషన్లను 99 రోజుల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం కొత్త రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించారు. దీని ద్వారా దరఖాస్తుదారులు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు దీనిని వినియోగించుకోవాలని కోరారు.