సీతారామచంద్రస్వామి దేవలయాన్ని అభివృద్ధి చేస్తా: మంత్రి
నల్గొండ పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవలయంలో నిన్న నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారామచంద్రస్వామి దేవలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. వైకుంఠ ఏకదశినాటికి ఉత్తర ద్వారా దర్శనం కోసం గోపురం నిర్మాణం పూర్తి చేయిస్తామన్నారు. త్వరలోనే స్థలం సేకరించి పనులు ప్రారంభిస్తామన్నారు.