ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన ఆవు

W.G: ఆకివీడులో ఓ ఆవు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. స్థానిక అమృతరావు కాలనీలో రెండేళ్లు కలిగిన ఆవు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయం కాలనీ వాసులు ఆర్ఎస్ఎస్ కార్యకర్త మాణిక్యాలరావుకు చెప్పారు. ఆయన అక్కడికి చేరుకుని పశువైద్యాధికారి ప్రసాద్‌కు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వైద్యుడు చేరుకుని కడుపు నొప్పితో బాధ పడుతోందని గుర్తించి చికిత్స చేశారు.