'మొక్కజొన్న, పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి'
BDK: టేకులపల్లి మండలం ఎర్రాయిగూడెం గ్రామంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఈనెల 10న కొత్తగూడెం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని IFTU రాష్ట్ర నాయకులు ప్రసాద్ అన్నారు. రైతాంగం పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. మొక్కజొన్న, పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పారు.