ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు

KRNL: ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు ఈనెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించబడతాయని, మహాసభల పోస్టర్ సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య విడుదల చేశారు. నేటి సమాజంలో యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతుందని దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ భృతిని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన నిరుద్యోగ సమస్యలు అలానే ఉన్నాయన్నారు.