కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

SRPT: చింతలపాలెం మండలం కిష్టాపురంలో కాంగ్రెస్ అధికార వర్గం–రెబల్స్ మధ్య ఘర్షణ జరిగింది. రాత్రి 8:15 గంటలకు రెబల్స్.. ఎస్సీ కాలనీ నాయకుల, 3వ వార్డు సభ్యుల ఇళ్లపై దాడులు చేశారు. దీంతో సామాగ్రి, తలుపులు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకునే లోపే  ఇరువర్గాలు పరారయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.