HMDA కీలక ప్రణాళిక.. మూసీపై 29 వంతెనలు

HMDA కీలక ప్రణాళిక.. మూసీపై 29 వంతెనలు

TG: HYD నగరంలో సమగ్ర రవాణా వ్యవస్థపై HMDA కీలక ప్రణాళికను సిద్ధం చేసింది. 2050 నాటికి మెట్రో నెట్‌వర్క్‌ను 556.6 కిలోమీటర్లు, MMTS నెట్‌వర్క్‌ను 336.4 కిలోమీటర్లు, రోడ్‌ నెట్‌వర్క్‌ను 19,352 కిలోమీటర్లకు విస్తరించనున్నట్లు తెలిపింది. HYDలో 120 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు, స్కైవాక్‌లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మూసీ నదిపై 29 వంతెనలు నిర్మించనున్నట్లు పేర్కొంది. సమగ్ర రవాణా వ్యవస్థ ప్రణాళికకు రూ.4 లక్షల కోట్లు అవసరమని హెచ్‌ఎండీఏ అంచనా వేసింది.