ఈటీవీ ఈవెంట్‌లో ఉత్తరాంధ్ర నుంచి తొలి మహిళ

VZM: ఈ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్‌లో ఉత్తరాంధ్ర నుంచి గజపతినగరం మండలానికి చెందిన రుంకాన రామలక్ష్మి తొలి మహిళగా పాల్గొంటున్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర మహిళలకు ఆదర్శవంతురాలుగా నిలిచిన గార్విడి లక్ష్మి, ఇప్పటి తరానికి రామలక్ష్మి ఆదర్శవంతంగా నిలవడం విశేషం. ఈ మేరకు జానపద సాహిత్య కళా వేదిక తరపున రామలక్ష్మికి పలువురు అభినందనలు తెలిపారు.