VIDEO: బస్టాండ్‌లో కూలిన పిట్టగోడ

VIDEO: బస్టాండ్‌లో కూలిన పిట్టగోడ

GDWL: ఎర్రవల్లి మండలంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రయాణ ప్రాంగణంలో బుధవారం ఒక్కసారిగా పిట్టగోడ కూలింది. శిథిలావస్థకు చేరిన ఈ భవనం కూలిన సమయంలో అక్కడ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. భవనం పరిస్థితిపై అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించాలని స్థానికులు అంటున్నారు.