స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే
కోనసీమ: ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు అందించటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామంలో రూ.45.34 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జల జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ త్రాగు నీరు అందించడం జరుగుతుందన్నారు.