ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడానికి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని రాంపూర్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలన్నారు.