VIDEO: వ్యవస్థలకు రూపకల్పన చేసిన మహనీయులు అంబేద్కర్: ఎమ్మెల్యే
KMM: అన్ని రకాల వ్యవస్థలకు రూపకల్పన చేసిన మహానీయులు డా.బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎదుట అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ప్రపంచం గర్వించదగ్గ ప్రముఖుల్లో ముఖ్యులు అంబేద్కర్ అని కొనియాడారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారన్నారు.