గుడివాడ ఏరియా ఆసుపత్రి సుపరింటెండెంట్ సస్పెండ్

గుడివాడ ఏరియా ఆసుపత్రి సుపరింటెండెంట్ సస్పెండ్

కృష్ణా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరా దేవి సస్పెన్షన్‌కు గురయ్యారు. విధులకు రాకుండా హాజరైనట్లు సంతకాలు చేసినందుకు చర్యలు తీసుకున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అధికారులు విధులకు హాజరుకాకుండానే రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో మంత్రి సీరియస్ అయ్యారు. ఈ మేరకు సస్పెన్షన్ వేటు వేశారు.