కాపర్ వైర్ దొంగల బృందం అరెస్ట్

BDK: మణుగూరు డివిజన్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కాపర్ వైర్ దొంగతనం చేస్తున్న ఐదుగురిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇటీవల దొంగతనాలు పెరగడంతో స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు, నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.4 లక్షల విలువైన కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు DSP రవీందర్ తెలిపారు.