యూరియా విక్రయాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
MDK: రసీదులలో యూరియా బస్తా రూ.266 నమోదు చేస్తూ రూ.300కు విక్రయిస్తున్నారని రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ కు ఫిర్యాదు చేశారు. కొల్చారం (M) అప్పాజీపల్లిలో పంటల నమోదు యాప్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ వచ్చారు. రంగంపేట, దుంపలకుంటలోని ఎరువుల దుకాణాలలో అదిక ధరకు యూరియా విక్రయించారని, వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు.