'ఫుడ్ పాయిజన్‌కు కారకులైన అధికారులను సస్పెండ్ చేయాలి'

ADB: నార్నూరు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని USFI జిల్లా కార్యదర్శి ఆత్రం నగేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.