ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం చిరువానుప్పలపాడు గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి కళ్యాణం జరిగి 16 రోజుల పండుగ ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం స్వామివారికి భక్తులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు శివరామ శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.