బైక్ అదుపు తప్పి వ్యాపారి మృతి

బైక్ అదుపు తప్పి వ్యాపారి మృతి

ASR: పెదబయలు మండలం గుల్లేలులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చేపల వ్యాపారి మృతి చెందాడు. చేపలు విక్రయించి తిరుగుప్రయాణంలో ఆయన బోయరాజుపాలెం వంతెన వద్ద బైక్ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన వ్యక్తి నర్సీపట్నం ఏరియాకి చెందినవాడిగా గుర్తించారు.