'విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి'
SRPT: విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని పట్టుదలతో చదువుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ విద్యార్థులకు సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం గరిడేపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఎంచుకున్న ఉన్నత లక్ష్యాలను సాధనతో సాధించుకునేందుకు కృషి చేయాలని కోరారు.