వివాహ వేడుకలో భోజనాలు వికటించి మహిళ మృతి

శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరు గ్రామంలో జరిగిన ఓ వివాహ విందు భోజనాలు వికటించి ఓ మహిళ మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. మృతురాలు మందస మండలం బేతాళపురం గ్రామానికి చెందిన తెప్పల జానకమ్మ (35)గా పోలీసులు గుర్తించారు. అస్వస్థతకు గురైన పదిమంది వ్యక్తులను చికిత్స నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు