రోడ్లపైనే పశువుల తిష్ట.. రాకపోకలకు అంతరాయం
ASF: తిర్యాణి మండల కేంద్రంలోని ప్రధాన రహదారులపై పశువులు గుంపులుగా తిష్ట వేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పశువులు పడుకోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ప్రయాణం ప్రాణసంకటంగా మారిందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు.