SC, ST కేసు నిందితుల అరెస్టులో పోలీసుల అలసత్వం

SC, ST కేసు నిందితుల అరెస్టులో పోలీసుల అలసత్వం

ASF: దహెగాం మండల పోలీస్ స్టేషన్లో నమోదైన SC, ST అట్రాసిటీ కేసు నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని రాంజీ గోండ్ సేవా సమితి నాయకులు ఆరోపించారు. ఈ మేరకు శనివారం SC,ST అట్రాసిటీ మానిటరింగ్ జిల్లా కమిటీ నాయకుడు కేశవరావును కలిసి సత్వర చర్య కొరకు వినతిపత్రం అందజేశారు. త్వరలో DSPని కలసి న్యాయం జరిగేలా చర్య తీసుకుంటామన్నారు.