కొమురవెల్లి మల్లన్న ఆలయ స్వాగత తోరణం ధ్వంసం
SDPT: రాజీవ్ రహదారి సమీపంలో అధిక లోడుతో పత్తిని తరలిస్తున్న లారీ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కమాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కమాన్ పైభాగం ధ్వంసమైంది. భారీ లోడుతో ఎత్తయిన లారీ వెళ్లడం వల్ల తోరణానికి తగలడంతో పెచ్చులూడి కింద పడిపోయాయి. అధికారులు లారీ యజమానిపై చర్యలు తీసుకొని కమాన్ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.