'దుకాణాలను వెంటనే ఖాళీ చేయాలి'

'దుకాణాలను వెంటనే ఖాళీ చేయాలి'

BHPL: మహాదేవపూర్ (M ) కాలేశ్వరంలోని గోదావరి నది పుష్కర ఘాట్ ప్రాంతంలో వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండడంతో వ్యాపారస్తులు తమ దుకాణాలను వెంటనే ఖాళీ చేయాలని బుధవారం గ్రామ కార్యదర్శి సత్యనారాయణ ఆదేశించారు. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా దుకాణాలను ఖాళీ చేయాలని మైకు ద్వారా ప్రచారం చేశారు.