సాయినగర్ సమస్యలకు మంత్రి సత్యకుమార్ పరిష్కారం

సాయినగర్ సమస్యలకు మంత్రి సత్యకుమార్ పరిష్కారం

సత్యసాయి: ధర్మవరంలోని సాయినగర్ ప్రాంతంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న లో-వోల్టేజ్ సమస్యకు మంత్రి సత్యకుమార్ యాదవ్ శాశ్వత పరిష్కారం చూపారు. లో-వోల్టేజ్ కారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోతుండగా, ప్రజల వినతి మేరకు మంత్రి వెంటనే స్పందించి, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించారు. గతంలో సగంలో ఆపేసిన సీసీ రోడ్డును పూర్తి చేయించగా.. నేతలు ఇవాళ ప్రారంభించారు.