టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం

TPT:హైదరాబాద్‌కి చెందిన శ్రీ ముత్తవరపు నాగరాజు అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళం అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.