అనంతపురంలో హర్ ఘర్ తిరంగ ర్యాలీ

ATP: అజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అనంతపురంలో హర్ ఘర్ తిరంగ ర్యాలీని నిర్వహించారు. స్థానిక టవర్ క్లాక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, క్రీడా యువత, పౌరులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలు చేతబట్టి చేపట్టిన ఈ ర్యాలీ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.