మాజీ ఎమ్మెల్యే నివాసానికి మాజీ సీఎం

మాజీ ఎమ్మెల్యే నివాసానికి మాజీ సీఎం

VSP: విశాఖలోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లారు. ఇటీవల వివాహం చేసుకున్న వాసుపల్లి రెండో కుమారుడు సాకేత్‌, కోడలు శ్రావణిలను ఆశీర్వదించారు. నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి, వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వాసుపల్లి కుటుంబ సభ్యులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు.