కోట బురుజులను సంరక్షించాలంటూ ఎంపీకి వినతి

JGL: చారిత్రాత్మక కట్టడమైన కోట బురుజు, కోనేరు స్థలాలను సంరక్షించాలని కోరుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు కోరుట్ల పట్టణంలోని వామపక్ష ప్రజాసంఘాల నాయకులు వినతిపత్రాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మట్లాడుతూ.. ఎంతో ఘన చరిత్ర కలిగిన కోట బురుజులు, కోనేరు స్థలాలను రియలెస్టేట్ వ్యాపారులతో స్థానికంగా ఉన్న కొందరు స్థలాలను కాజేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.