డిప్యూటీ సీఎం, మంత్రులను కలిసిన రామగుండం ఎమ్మెల్యే
PDPL: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబులను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పూలబొకే అందజేసి, శాలువా కప్పారు. ఇటీవల జరిగిన మంత్రుల కేబినేట్ మీటింగ్‌లో రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.