సాహితీ ఇన్ ఫ్రా మాజీ డైరెక్టర్ అరెస్ట్

సాహితీ ఇన్ ఫ్రా మాజీ డైరెక్టర్ అరెస్ట్

TG: సాహితీ ఇన్ ఫ్రా మాజీ డైరెక్టర్ పూర్ణచందర్ రావు అరెస్టయ్యాడు. ఆయనను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో సాహితీ ఇన్ ఫ్రా మోసాలు వెలుగులోకి వచ్చాయి. విల్లా, ప్లాట్ల పేరుతో సుమారు 700 మంది కస్టమర్ల నుంచి రూ. 800 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. అందులో రూ.120 కోట్లు దారిమళ్లించినట్లు పేర్కొన్నారు. రూ. 50 కోట్లను హవాళా మార్గంలో తరలించినట్లు గుర్తించారు.