రేపు చెన్నకేశవ స్వామికి లక్ష తులసి అర్చన కార్యక్రమం
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వణాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు లక్ష తులసి అర్చన కార్యక్రమం ఉంటుందన్నారు. పట్టణంలోని భక్తులంతా అర్చన కార్యక్రమంలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.