అన్న క్యాంటీన్‌ల కోసం అడ్వైజరీ కమిటీల ఏర్పాటు
AP: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల సమర్థవంతమైన పర్యవేక్షణ, నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ద్వారా జీవో విడుదల చేసింది. ఈ జీవో ద్వారా రాష్ట్రంలో అన్న క్యాంటీన్ లెవెల్ అడ్వయిజరీ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రతీ క్యాంటీన్‌లో ఛైర్మన్ సహా మొత్తం ఆరుగురు సభ్యులు ఉండనున్నారు.