బాపట్ల-మార్కాపురం రైల్వే లైన్ సర్వేకు విజ్ఞప్తి

బాపట్ల-మార్కాపురం రైల్వే లైన్ సర్వేకు విజ్ఞప్తి

బాపట్ల: ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో బాపట్ల-మార్కాపురం కొత్త రైల్వే లైన్ కోసం సర్వే చేయాలని కోరారు. ఈ లైన్ బాపట్ల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు మీదుగా వెళ్తుందని తెలిపారు. దీనివల్ల రైతులు, విద్యార్థులకు మేలు జరుగుతుందని, గ్రానైట్, సున్నపురాయి రవాణా సులభమవుతుందని వివరించారు.