మహిళలకు ఆదర్శంగా నిలిచిన స్వప్న

మహిళలకు ఆదర్శంగా నిలిచిన స్వప్న

SKLM: గార మండలం జొన్నలపాడుకు చెందిన ఎం. స్వప్న అసాధారణ ప్రతిభతో మహిళలకు ప్రేరణగా నిలిచారు. వివాహం తర్వాత కూడా పట్టుదలతో చదివి, కేవలం రెండు నెలల్లోనే ఐదు బ్యాంకు ఉద్యోగాలను దక్కించుకుంది. రెండు PO పోస్టులు, రెండు క్లర్క్ పోస్టులు, ఒక జూనియర్ అసోసియేట్ ఉద్యోగం సాధించి మహిళలకు ఆశాదీపంగా మారింది. ఆమె కథ ఆదర్శంగా నిలిచింది.