నేడు స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం..?

నేడు స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం..?

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ స్మృతి వనం నిర్మాణం, ఆయన కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.