విశ్రాంత ఉద్యోగులకు DA, CPCల్లో కోత.. క్లారిటీ

విశ్రాంత ఉద్యోగులకు DA, CPCల్లో కోత.. క్లారిటీ

కేంద్రం రిటైర్డ్ ఉద్యోగులకు డీఏతో పాటు సెంట్రల్ పే కమిషన్ ప్రయోజనాలను నిలిపివేసిందంటూ ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తను కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ ప్రచారం ముమ్మాటికీ అబద్దమని తేల్చి చెప్పింది. దుష్ప్రవర్తన కారణంగా తొలగించిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే పదవీ విరమణ ప్రయోజనాలు నిలిచిపోతాయని తెలిపింది.