VIDEO: రోడ్డుకు మరమ్మతులు చేయించిన అధికారులు
RR: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్‌పల్లి మున్సిపల్ చేవెళ్ల వెళ్లే రోడ్డులో హనుమాన్ నగర్ కాలనీ వద్ద రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. ఈ కంకర తేలిన రోడ్డుకు ఈరోజు ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మతులు చేశారు. తమ ఇబ్బందులను తొలగించినందుకు అధికారులకు, ప్రజలు, వాహనదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.