'పెద్ది' సెకండ్ సింగిల్‌పై చిరంజీవి పోస్ట్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న 'పెద్ది' మూవీ సెకండ్ సింగిల్ 'రై రై రారా' సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పాటపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. 'ఈ పాట తెరపై అద్భుతమైన శక్తి, భావోద్వేగాల సమ్మేళనం. చరణ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే గర్వంగా ఉంది. ఆయన గ్రేస్ చూడముచ్చటగా ఉంది' అని ట్వీట్ చేశారు. అలాగే చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.