తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ

KNR: జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. జమ్మికుంటకు చెందిన ZPHS ప్రధానోపాధ్యాయులు సుధాకర్ కుటుంబీకులతో కలిసి ఈ నెల 3న తిరుపతికి వెళ్లారు. ఈనేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి తాళాన్ని దొంగలు ధ్వంసం చేసి బీరువాలోని మూడు తులాల బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. సోమవారం బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.